అక్కినేని ఇంట క్రిస్మస్ సంబరాలు...

Thursday,December 15,2016 - 08:00 by Z_CLU

క్రిస్మస్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. డీమానిటైజేేషన్ ఎఫెక్ట్ ఓవైపు కొనసాగుతున్నప్పటికీ.. షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. టాలీవుడ్ స్టార్ కపుల్స్ కూడా క్రిస్మస్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఇప్పటికే తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లేందుకు స్కెచ్ రెడీచేేసుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య-సమంత కూడా తమ ప్లాన్స్ బయటపెట్టారు.

naga-chaitanya-christmass

    ఈ క్రిస్మస్ ను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చైతూ-శ్యామ్ ఫిక్స్ అయ్యారు. కేవలం ఫిక్స్ అవ్వడమే కాదు.. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోలు అవే. క్రిస్మస్ కు ఫారిన్ ట్రిప్పులు లాంటివేవీ పెట్టుకోకుండా… ఇంట్లోనే సరదాగా సంబరం చేసుకోవాలని చైతూ-సమంత నిర్ణయించుకున్నారు. అందుకే ఇలా ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.