సుశాంత్ సినిమాలో అక్కినేని బ్రదర్స్ ?

Saturday,August 06,2016 - 04:59 by Z_CLU

సుశాంత్ హీరోగా నటించిన మూవీ ఆటాడుకుందాం రా. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటల్ని తాజాగా విడుదల చేశారు. ఏఎన్నార్ సూపర్ హిట్ మూవీలోంచి పల్లెకు పోదాం..పారును చూద్దాం చలో..చలో అనే పాట రీమిక్స్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. మనం సినిమాలో అక్కినేనికి చెందిన ఓ పాటను రీమిక్స్ చేసిన అనూప్ రూబెన్స్… ఆటాడుకుందాం రాలో కూడా తన రీమిక్స్ మేజిక్ ను చూపించాడు. ఇదిలా ఉండగా… తాజాగా వచ్చిన ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతూ….’ఆటాడుకుందాం రా’ సినిమాను పబ్లిసిటీ పరంగా మరో పెట్టు పైకి ఎక్కించింది. ఈ సినిమాలో అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారట. నాగచైతన్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అలాగే అఖిల్ కూడా ఓ పాటలో సుశాంత్ తో కలిసి స్టెప్స్ వేస్తూ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తుంది.. మరి ఈవార్తలో నిజం ఎంతో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే..