అఖిల్ ఇంటర్వ్యూ

Wednesday,January 23,2019 - 04:15 by Z_CLU

ప్యాషనేట్ లవర్ లా కనిపించనున్నాడు అఖిల్. ఈ నెల 25 న రిలీజవుతున్న ‘మిస్టర్ మజ్ను’ తో ఫ్యాన్స్ కి మరింత దగ్గర కానున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడిన అఖిల్, ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా  మాట్లాడాడు. ఆ విషయాలు మీకోసం.

అదే రీజన్…

ఎప్పుడైతే వెంకీ ఈ స్టోరీ న్యారేట్ చేశాడో ఇన్స్ టంట్ గా నచ్చేసింది. నా ఫస్ట్ సినిమాకి ఈ స్టోరీలైన్ కరెక్ట్ కాదు అనుకున్నాను, అందుకే టైమ్ పట్టింది. మరీ ముఖ్యంగా సినిమాలో నా క్యారెక్టర్, చాలా చాలెంజింగ్ అనిపించింది.

ఆల్మోస్ట్ అరగంట…

సినిమాలో నా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాలో నా క్యారెక్టర్ ని ప్లే బాయ్ గా రిజిస్టర్ చేసే ఎలిమెంట్స్ దాదాపు అరగంట ఉంటాయి. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది ఫస్టాఫ్.

‘మిస్టర్ మజ్ను’ అలాంటిదే…

ఎంత ఎంటర్టైన్ మెంట్ ఉంటే సినిమా అంత సక్సెస్ అవుతుంది. రీసెంట్ గా హిట్ అయిన సినిమాలు కూడా అలాంటివే. మిస్టర్ మజ్ను సినిమా కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది సినిమాలో.

ఇన్స్ పైర్ అయ్యాడు…

వెంకీ… నాన్నగారి ‘మన్మధుడు’, ‘నిన్నే పెళ్ళాడతా’  సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయి రాసుకున్న కథ ఇది. ఆ సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ రొమాంటిక్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది.

అది మా జర్నీ…

వెంకీ నాకు పదేళ్లుగా తెలుసు కానీ, మేము క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు అంతే. గత రెండేళ్లుగా ఈ కథ చెప్పాక ఇంకా కొంచెం ఎక్కువగా తెలిసింది తన  గురించి. కానీ ఈ సినిమా చేసే ప్రాసెస్ లో వెంకీ నాకు వన్  ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాడు.

ప్యాషనేట్ లవర్…

సినిమాలో నా క్యారెక్టర్ ప్యాషనేట్ లవర్. అమ్మాయిల్ని ఇష్టపడుతుంటాడు. అమ్మాయిలూ కూడా తనను అంతే ఇష్టపడాలనుకుంటాడు.

డాడీ కూడా…

డాడీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు కాబట్టి సినిమాలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక సీన్ గురించి మాట్లాడినప్పుడు, మళ్ళీ రీషూట్ చేశాం. స్క్రిప్ట్ విన్నప్పుడే డాడీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్క చేంజ్ కూడా అడగలేదు.

అందుకే మిస్టర్…

మజ్ను సినిమా అనగానే ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఈ మజ్ను మాడరన్ అనిపించడానికే వెంకీ, మిస్టర్ అని చేర్చాడు.

ఈ జోనర్ మాత్రం వదలను…

లవ్ స్టోరీస్ చేస్తే ఇప్పుడే చేయాలి. ఇంకో 5 ఇయర్స్ తరవాత చేయలేను. అందుకే ఒకవేళ నేను కొత్త జోనర్స్ ట్రై చేసినా, మధ్యలో లవ్ స్టోరీస్ చేస్తూనే ఉంటా. ఈ జోనర్ మాత్రం వదిలిపెట్టను.

వెంకీ స్కేల్ పెంచాడు…

వెంకీ బిగినింగ్ లో నాకు న్యారేట్ చేసిన స్టోరీ చాలా సింపుల్ గా ఉంది. కానీ ఎప్పుడైతే 2 ఇయర్స్ బ్రేక్ తర్వాత సినిమా చేద్దామని డిసైడ్ అయ్యామో, స్కేల్ పెంచేశాడు. నా క్యారెక్టర్ ని ఫ్యామిలీకి మరింత దగ్గర చేశాడు. దాంతో సినిమాలో ఇమోషన్ డోస్ పెరిగింది. ఫైట్స్ కూడా 3 ప్లాన్ చేశాడు. అవి ఫస్ట్ టైమ్ స్టోరీ చెప్పినప్పుడు లేవు.

టైటిల్ సాంగ్…

సినిమా టైటిల్ సాంగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. మోర్ నంబర్ ఆఫ్ షాట్స్ ఉంటాయి ఈ సాంగ్ లో. అయితే ఈ సాంగ్ గురించి డిస్కర్షన్స్ జరుగుతున్నప్పుడే శేఖర్ మాస్టర్ ఆప్స్ ఉంటే బావుంటుందని చెప్పారు. చాలా కష్టపడ్డాను ఆ సాంగ్ కోసం. చాలా కొత్తగా ఉంటుందీ పాట.

B.V.S.N. ప్రసాద్ గారు…

ప్రసాద్ గారు మా తాతగారితో సినిమా చేశారు. ఇప్పుడు నాతో కూడా చేశారు. ఆయన బ్యానర్ లో చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ఆయన ఉన్నారంటే సెట్స్ పై హ్యాప్పీనెస్ ఉంటుంది. చూడగానే హగ్ చేసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూ, ఏదో ఒకటి తింటూ ఉంటారాయన…

దమ్ముండాలి…

ఆత్మవిమర్శ చేసుకోవడానికి దమ్ముండాలి. అది ఉంటేనే మనం ఏ తప్పులు చేశామో అవి రిపీట్ చేయకుండా ఉంటాం. కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ లోనే పర్ఫెక్ట్ అవుతాం.

తమన్ మ్యూజిక్ ….

లవ్ స్టోరీస్ కి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఉండే 6 పాటలు కూడా చాలా బావున్నాయి. అందరూ చాలా గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు.

స్పోర్ట్స్ సినిమా చేయాలంటే…

స్పోర్ట్స్ సినిమా చేయాలంటే కంపల్సరీగా ఆ సినిమా డైరెక్టర్ కూడా స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాంటి డైరెక్టర్ దొరికితే నేను కూడా స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేస్తా.

ఎక్స్ పెండబుల్స్ లాంటి సినిమా…

ఒకవేళ నేను గనక మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎక్స్ పెండబుల్స్ లాంటి సినిమా చేయాలని ఉంది.

నిధి అగర్వాల్ తో…

నిధి ‘సవ్యసాచి’ సినిమా చేస్తున్నప్పుడే రషెస్ చూసి వెంకీ ఇంప్రెస్ అయ్యాడు. ఈ సినిమాలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. బెంగళూరు అమ్మాయే కాబట్టి తెలుగు కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది.

ప్రతీది నాన్నే…

సినిమాల విషయంలో ఏ అడ్వైజ్ తీసుకున్నా నాన్న దగ్గరి నుండే. ఆయన సినిమాల విషయంలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఓ వైపు ప్రొడ్యూస్ చేస్తుంటారు, ఇంకోవైపు యాక్టింగ్ చేస్తుంటారు. ఆయన కన్నా ఇంకెవరు బెస్ట్ గైడ్ ఉంటారు..? ఆయనే నా గైడ్.