మరికొన్ని గంటల్లో అఖిల్ హంగామా

Wednesday,December 20,2017 - 10:59 by Z_CLU

హలో సినిమాకు సంబంధించి సిసలైన హంగామా మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. అక్కినేని యువసామ్రాట్ అఖిల్, అభిమానులతో కలిసి చిందేయబోతున్నాడు. స్వయంగా పాటలు పాడబోతున్నారు. హలో రిలీజ్ కు సరిగ్గా కొన్ని గంటల ముందు ఈ సర్ ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఎన్-కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభంకానున్న ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. మెగా తండ్రికొడుకుల సమక్షంలో, చిచ్చరపిడుగు అఖిల్ హంగామాతో గ్రాండ్ గా జరగనుంది “హలో-సింగ్&డాన్స్” ఈవెంట్.

సినిమాకు సంబంధించి ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికేట్ తో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది హలో. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో సినిమా.