సెంటిమెంట్ గా మారిన అఖిల్

Thursday,August 11,2016 - 11:12 by Z_CLU

 

అక్కినేని అఖిల్ వెండి తెరకు పరిచయం కాక ముందే స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడనడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే సిసింద్రీ తో అందరి కంటే ముందే వెండి తెర కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అఖిల్ ‘మనం’ సినిమా క్లైమాక్స్ లో తళుక్కున మెరిసి సినిమాకు హైప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సిసింద్రీ గెస్ట్ రోల్ లో కనిపించిన ‘మనం’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందుకేనేమో ఇప్పుడు మరో సారి తన బావ సుశాంత్ కోసం ‘ఆటాడుకుందాం రా’ సినిమాలోని ఓ పాటలో సుశాంత్ తో కలిసి ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు అఖిల్. మనం లో కనిపించింది కాసేపే అయినా అఖిల్ ఎంట్రీ సినిమాకు హైలైట్ గా నిలవడం తో మరో సారి అఖిల్ తో గెస్ట్ రోల్ చేయించాలని నిశ్చయించుకొన్నారట ‘ఆటాడుకుందాం రా ‘ యూనిట్. ప్రస్తుతం ఈ పాట ను అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రీకరిస్తున్నారు. ఇక ‘మనం’ సెంటిమెంట్ ఆటాడుకుందాం రా కి ఎలాంటి విజయం అందిస్తుందో? చూడాలి.