మరికొన్ని గంటల్లో "హలో" సర్ ప్రైజ్

Tuesday,November 14,2017 - 10:55 by Z_CLU

అక్కినేని చిచ్చరపిడుగు అఖిల్ నటిస్తున్న హలో సినిమాకు సంబంధించి మరికొన్ని గంటల్లో సస్పెన్స్ వీడనుంది. ఈరోజు ఈ సినిమా నుంచి చిన్నపాటి సర్ ప్రైజ్ ఉందంటూ నిన్న అఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సస్పెన్స్ ఏంటనేది సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు తేలిపోతుంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాగా అఖిల్ చేస్తున్న ఈ మూవీలో చాలా ప్రత్యేకతలున్నాయి. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. టీజర్ లేదా సాంగ్ బిట్ విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం సాగుతోంది. అదేంటో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

హలో సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ లిజి కూతురు కల్యాణి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.