#Akhil4 రిలీజ్ ఆ నెలలోనే?

Sunday,July 26,2020 - 05:21 by Z_CLU

అన్ని అనుకున్నట్లు జరిగితే అఖిల్ హీరోగా చేస్తున్న నాలుగో సినిమా ఈ పాటికి థియేటర్స్ లోకి వచ్చుండేది. ఓపినింగ్ అయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టి చకచకా పనులు చేసారు యూనిట్. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ , సింగిల్ విడుదల చేసి ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడటం డేట్ మార్చుకోవడం జరిగిపోయింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ మొదలు పెట్టే పరిస్థితి కనబడటం లేదు. ఎంత జాగ్రత్తలు పాటించినా యూనిట్ లో ఎవరో ఒకరికి వ్యాధి అంటడం చూస్తున్నాం. అందుకే పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టి ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసే సన్నాహాల్లో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. సో అఖిల్ తన నాలుగో సినిమాతో డిసెంబర్ లో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ , వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. పూజా హెగ్డే అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.