స్టార్ డైరెక్టర్ తో అఖిల్... త్వరలోనే అనౌన్స్ మెంట్

Sunday,December 09,2018 - 02:03 by Z_CLU

వినాయక్ డైరెక్షన్ లో లాంచ్ అయిన అఖిల్ మళ్ళీ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ డైరెక్టర్స్ లిస్టు లో కొరటాల శివ తో పాటు బోయపాటి శ్రీను, సుకుమార్ కూడా ఉన్నారు. ఆ మధ్య బోయపాటి తో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అనే వార్తలు  చక్కర్లు కొట్టాయి.

అయితే అఖిల్ తో సినిమా చేయాలని నాగ్ అడిగారని త్వరలోనే అఖిల్ తో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు బోయపాటి. కానీ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు బోయపాటి. దీంతో అసలు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే డౌట్ రైజ్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ సినిమా తర్వాత బోయపాటి అఖిల్ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబో సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.