అఖిల్ రెండో సినిమా ప్రారంభం

Monday,April 03,2017 - 10:35 by Z_CLU

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాలపై ‘కింగ్’ నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2 సాయంత్రం 6 : 17 కి అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ఈ మూవీ ప్రారంభమైంది. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి వచ్చారు. ‘మనం’ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని నాగ్ అన్నారు. ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.

అఖిల్ కు ఇది డిఫరెంట్ మూవీ అవుతుందని అంటున్నారు దర్శకుడు విక్రమ్ కుమార్. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. హీరోయిన్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.