సెంటిమెంట్ ఫాలో అవుతున్న వెంకీ అట్లూరి

Wednesday,May 16,2018 - 10:50 by Z_CLU

త్వరలోనే అఖిల్ హీరోగా తన రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమాకు సంబంధించి లండన్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు ఈ డైరక్టర్. తొలిప్రేమ సినిమాను లండన్ లో షూట్ చేశారు. ఆ సెంటిమెంట్ కొద్దీ అఖిల్ సినిమాను కూడా లండన్ షెడ్యూల్ తోనే స్టార్ట్ చేస్తున్నాడు.

అఖిల్-వెంకీ అట్లూరి సినిమా షూటింగ్, ఈనెల 29 నుంచి లండన్ లో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి వెంకీ అట్లూరితో పాటు టెక్నికల్ టీమ్ అంతా ఇప్పటికే లండన్ చేరుకుంది. కొన్ని లొకేషన్లు ఫైనలైజ్ చేశారు, మరో వారంలో మిగతా లొకేషన్లు ఫిక్స్ చేస్తారు.

నిజానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. అక్కడ లొకేషన్ల రెక్కీ కూడా పూర్తయింది. మరో 4 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ సెడన్ గా లండన్ షెడ్యూల్ ను తెరపైకి తీసుకొచ్చారు.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి, నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్.