Akhil Makeover - ఈ కష్టం అందుకేనా?

Tuesday,August 25,2020 - 01:54 by Z_CLU

మాస్ ఆడియన్స్ ని అలరించే స్క్రిప్ట్ దొరకడమే ఆలస్యం కుర్ర హీరోలు జిమ్ముల్లో గంటల కొద్దీ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా Akhil Akkineni  కూడా అదే చేస్తున్నాడు. హెవీ వర్కౌట్స్ చేస్తూ ఫ్యాన్స్ కోసం రెండు స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అఖిల్. ఆ స్టిల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ Akhil Gym స్టిల్స్ అతడి కొత్త సినిమా కోసమేనా అనే చర్చ నడుస్తుంది.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో తన నాలుగో సినిమా చేస్తున్న అఖిల్.. Surender Reddy డైరెక్షన్ లో తన ఐదో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికే అక్కినేని కుర్ర హీరో బాడీ బిల్డప్ చేస్తున్నాడట.

ఈ సినిమాతో నాగార్జున తనయుడ్ని కొత్తగా ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నాడట సురేందర్ రెడ్డి. అందుకే అఖిల్ ఉన్నపళంగా ఈ కసరత్తులు మొదలు పెట్టాడని టాక్.