వచ్చే నెల నుంచి సెట్స్ పైకి...

Sunday,February 19,2017 - 10:05 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే రెండో సినిమాతో సెట్స్ పైకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది.

అయితే రెండో సినిమా కోసం చాలా కథ విన్న అఖిల్ ఫైనల్ గా ఓ కథ ను సెలెక్ట్ చేసుకొని ఆ కథతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు..ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారట యూనిట్. విక్రమ్ డిఫరెంట్ మేకింగ్ స్టైల్లో యూత్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్….