అఖిల్ ‘హలో’ సినిమాలో మరో హీరోయిన్

Wednesday,September 13,2017 - 12:24 by Z_CLU

అఖిల్ హలో మూవీ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

 

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ సినిమా కోసం తమిళ అమ్మాయి నివేదిత సతీష్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.