అఖిల్ ఎంగేజ్ మెంట్ లో హైలెట్ అదే

Saturday,December 10,2016 - 11:13 by Z_CLU

akhil-shriya

టాలీవుడ్ లో ఎక్కడ చూసిన అఖిల్, శ్రియ భూపాల్ ల ఎంగేజ్ మెంట్ గురించే డిస్కషన్ నడుస్తుంది. ఒక్క సినిమాతోనే తన మెస్మరైజింగ్ లుక్ అండ్ స్టైల్ తో అమ్మాయిల గుండెల్లో గూడు కట్టుకున్న అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల ఎంగేజ్ మెంట్ GVK హౌజ్ లో గ్రాండ్ గా జరిగింది.

ఎంగేజ్ మెంట్ అకేషన్ లో అఖిల్, శ్రియలే కాదు సమంతా, చైతు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అతి తక్కువ మంది మధ్య ఘనంగా జరిగిన ఈ వేడుకలో అనూప్ రూబెన్స్, అంకిత్ తివారి మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

ఏది ఏమైనా అక్కినేని వారి స్పీడ్, ఎగ్జైట్ మెంట్ చూస్తుంటే 2017 లోపు నాగార్జున ఇద్దరు వారసులు ఒకింటి వారు కావడం ఖాయం అనిపిస్తుంది. డేట్ పక్కాగా ఫిక్స్ చేయలేదు కానీ, ఇటలీలో అఖిల్, శ్రియ ల పెళ్ళి చేయాలని ప్లాన్ చేస్తున్న నాగార్జున, చైతు, స్యామ్ ల పెళ్ళిని కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు.