హను రాఘవపూడి తో అఖిల్ రెండో చిత్రం.

Monday,July 25,2016 - 04:57 by Z_CLU

 

తొలి సినిమా విడుదలైన తర్వాత ఇప్పటివరకు మరో ప్రాజెక్టు ప్రకటించలేదు అక్కినేని అఖిల్. శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి లాంటి ఎంతోమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. తాజాగా ఈ సిసింద్రీ తన రెండో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ప్రకటించాలని భావిస్తున్నారట. కొన్ని రోజులుగా దర్శకుడు హను రాఘవపూడితో చర్చలు జరుపుతున్నాడు అఖిల్. ఆ స్టోరీలైన్ అతడికి బాగా నచ్చిందట. అఖిల్ తో పాటు నాగార్జున కూడా ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే నచ్చినట్టు సమాచారం. దీంతో హను రాఘవపూడి దర్శకత్వంలోనే రెండో సినిమా చేయాలని అఖిల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. ఇంకా నెల రోజులు గ్యాప్ ఉంది కాబట్టి… ఈ టైమ్ లో హీరోయిన్ ఎవరనేది డిసైడ్ చేయడంతో పాటు… సినిమాకు ఓ టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేసే అవకాశాలున్నాయి.