సమ్మర్ పై కన్నేసిన అక్కినేని హీరో

Saturday,December 07,2019 - 02:23 by Z_CLU

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కాల్షీట్లు బట్టి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు అనుకోకుండా పూజా కాల్షీట్లు సెట్ అయ్యాయి. దీంతో సమ్మర్ నాటికి సినిమాను రెడీ చేయాలని యూనిట్ భావిస్తోంది.

అల వైకుంఠపురములో సినిమాను కంప్లీట్ చేసిన పూజా హెగ్డే, లెక్కప్రకారం ప్రభాస్ తో కలిసి జాన్ మూవీ సెట్స్ పైకి వెళ్లాలి. కానీ ఆ సినిమా షూటింగ్ నెల రోజులు వాయిదా పడిందట. దీంతో ఆ కాల్షీట్లను అఖిల్ మూవీకి షిఫ్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

అనుకోని విధంగా పూజా హెగ్డే కాల్షీట్లు దొరకడంతో, అఖిల్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తికాబోతోంది. పూజా హెగ్డే నెల రోజుల కాల్షీట్లంటే దాదాపు ఆమె పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన పోర్షన్ ను నెమ్మదిగా పూర్తిచేసుకున్నా, సినిమాను మే నెల నాటికి రెడీ చేయొచ్చనేది నిర్మాతల ప్లానింగ్.