Double Bonanza - Akhil నుంచి ఈసారి రెండు!

Wednesday,September 09,2020 - 12:47 by Z_CLU

రెండేళ్ళకోసారి సినిమాతో పలకరించే అక్కినేని యంగ్ హీరో Akhil ఇప్పుడు స్పీడ్ పెంచబోతున్నాడు. అవును వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం Bommarillu Bhaskar తో అఖిల్ చేస్తున్న ‘Most Eligible Bachelor’ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది.

ఇక లేటెస్ట్ గా Surender Reddyతో మూవీ ఎనౌన్స్ చేశాడు అఖిల్. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టబోతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేసి 2021 ఎండింగ్ లోపే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. AK Entertainments, Surrender 2 Cinema సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఇలా మినిమం గ్యాప్స్ లో 2 సినిమాలు అందించే ప్రయత్నం చేస్తున్నాడు అక్కినేని అఖిల్