అఖిల్ నెక్స్ట్ సినిమా అదేనా ?

Sunday,August 26,2018 - 11:02 by Z_CLU

ప్రస్తుతం తన మూడో సినిమాతో బిజీ గా ఉన్నాడు అఖిల్.. మొదటి సినిమా నుండి నెక్స్ట్ సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుంటూ ఆచి తూచి వ్యవహరిస్తున్న అఖిల్ ప్రస్తుతం తన ధోరణి మార్చుకుంటున్నాడని తెలుస్తుంది. అఖిల్ సినిమా తర్వాత హలో కి చాలా టైం తీసుకున్న అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకి ముందు కూడా కొంత టైం తీసుకున్నాడు.

అయితే నెక్స్ట్ సినిమాకి మాత్రం అంత టైం తీసుకోకుండా త్వరలోనే ఆ సినిమాను సెట్స్ పై పెట్టేయాలని చూస్తున్నాడట అఖిల్.త్వరలోనే ఆది పినిశెట్టి బ్రదర్ సత్య ప్రభాస్ తో ఓ సినిమా చేసేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.

ఇటివలే ఆది పినిశెట్టి కూడా తన బ్రదర్ సత్య ప్రభాస్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తో రానున్నాడని ఆ సినిమా అనౌన్స్ మెంట్ ప్రొడక్షన్ నుండి వస్తేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. సో ఆ అనౌన్స్ మెంట్ అఖిల్ – సత్య ప్రభాస్ సినిమాదే అని టాక్.