టైటిల్ ఫిక్స్ చేసుకున్న అఖిల్... ఫస్ట్ లుక్ అప్పుడే !

Sunday,June 03,2018 - 04:03 by Z_CLU

తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం అఖిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు Mr.మజ్ను అనే  టైటిల్ ను ఫిక్స్ చేసారట.  ఇప్పటికే ఈ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో నాగ్ నటించిన మజ్ను టైటిల్ కు ముందు మిస్టర్ చేర్చి ఈ  టైటిల్ ను  ఫైనల్ చేసారట మేకర్స్.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు సంబంధించి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 29న   ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

అఖిల్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బోగవల్లి బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.