‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గా అఖిల్

Tuesday,February 04,2020 - 05:57 by Z_CLU

టైటిల్ ని బట్టి అఖిల్ కొత్త సినిమా కూడా లవ్ ఎంటర్టైనరే అని తెలుస్తుంది. సినిమా టైటిల్ ని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గా ఫిక్సయిన మేకర్స్, ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 8, 6:18 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయనున్నారు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలపై ఆడియెన్స్ లో ఉన్న అంచనాలు దానికి తోడు ఫ్యాన్స్ లో అఖిల్ కి ఉన్న క్రేజ్, ఈ సినిమాని న్యాచురల్ గా లైమ్ లైట్ లోకి తీసుకువస్తుంది.

మరికొన్ని రోజుల్లో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎలా కనిపించబోతున్నాడనేది తెలిసింది. హార్ట్ టచింగ్ లవ్ ఎలిమెంట్స్ తో పాటు తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై  బన్ని వాసు, వాసు వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.