Akkineni Heroes - ఒకే నెలలో?

Friday,April 23,2021 - 09:35 by Z_CLU

ప్రస్తుతం కరోన తీవ్రత ఎక్కువ ఉండటంతో షూటింగ్స్ వాయిదా పడటం , థియేటర్స్ మూసివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాలు వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. పోస్ట్ పోన్ అయిన ఏ ఒక్క సినిమాకు సంబంధించి ఇంత వరకు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. పరిస్థితులు చక్కబడ్డాక సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అన్నీ విడుదలలు వాయిదా పడ్డాయి. అందులో నాగ చైతన్య ‘లవ్ స్టోరి’ కూడా ఉంది. రిలీజ్ డేట్ దాక వచ్చిన ఈ సినిమాను కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఉన్నపళంగా వాయిదా వేశారు మేకర్స్.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే నెల కూడా సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కరోన ప్రభావం మే నెల చివరి వరకూ లేదా జూన్ మొదటి వారం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో వచ్చే నెల కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి రానట్టే. ఇక జూన్ లో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ థియేటర్స్ లోకి రానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జనవరిలోనే అఖిల్ సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా సంక్రాంతి బరిలో నుండి తప్పుకొని జూన్ కి వెళ్ళింది.

ఇక ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ లో రిలీజ్ అవ్వడం ఖాయం. ఇక అదే నెలలో ‘లవ్ స్టోరి’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే అక్కినేని అన్నదమ్ముల నుండి ఒకే నెలలో రెండు సినిమాలు రానున్నయన్నమాట. ఈ రెండు సినిమాలను రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ అక్కినేని హీరోల నుండి రాబోతున్న ఈ రెండు సినిమాలు మన్సూన్ సీజన్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటాయో ఒకే నెలలో ఇద్దరు ఎంత కలెక్ట్ చేస్తారో తెలియాలంటే ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics