6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్

Wednesday,January 23,2019 - 11:02 by Z_CLU

అఖిల్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ కి తోడు ‘మిస్టర్ మజ్ను’ మేకర్స్ సినిమాని ప్రమోట్ చేస్తున్న స్ట్రాటజీ, సినిమాని రిలీజ్ కి ముందే సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఏకంగా 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ‘మిస్టర్ మజ్ను’ పై ఆడియెన్స్ లో ఏ రేంజ్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉందో, ఏ ట్రైలర్ క్రియేట్ చేస్తున్న  వైబ్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.

ఈ సినిమా నుండి మొదట్లో రిలీజైన టీజర్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అనిపించిన మేకర్స్, ఈ ట్రైలర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా క్యూరియాసిటీ రేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దానికి తోడు అఖిల్ గ్రేస్ అక్కినేని  ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ లా ట్రాన్స్ ఫామ్ అవుతుంది.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన కనిపించనుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజర్. జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమాకి B.V.S.N. ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.