మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన Mrమజ్ను టైటిల్ ట్రాక్

Thursday,December 27,2018 - 02:48 by Z_CLU

సోషల్ మీడియాలో Mr మజ్ను సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ ట్రాక్, యూత్ కి తెగ నచ్చేస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. సినిమాలోని తక్కిన సాంగ్స్ పై కూడా భారీ స్థాయిలో ఎక్స్ పెక్ టేషన్స్ క్రియేట్ చేస్తుందీ టైటిల్ ట్రాక్.

ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజైన 2 సాంగ్స్, డిఫెరెంట్ ఫీల్ ఉన్నవే. ఫస్ట్ సాంగ్ ‘ఏమైనదో ఏమైనదో’ సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తే, ఈ టైటిల్ ట్రాక్ మాత్రం సినిమాలో అఖిల్ రోల్ ఎంత జోష్ ఫుల్ గా ఉండబోతుందన్నది క్లారిటీ ఇచ్చింది. జస్ట్ ఈ ఒక్క సాంగ్ తోనే ఆల్మోస్ట్ యూత్ కాన్సంట్రేషన్ ని ‘Mr మజ్ను’ పై ఫిక్సయింది.

జనవరి 25 న రిలీజవుతుంది Mr. మజ్ను. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్టర్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. తమన్ మ్యూజిక్ కంపోజర్.