Mr. మజ్ను రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,December 13,2018 - 12:03 by Z_CLU

నిన్నమొన్నటి వరకు జనవరిలో రిలీజ్ గ్యారంటీ అని కన్ఫమ్ చేసిన Mr. మజ్ను మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది.

ఇప్పటికే ఆల్మోస్ట్ యూత్ కాన్సంట్రేషన్ ఈ సినిమాపై ఫిక్సయి ఉంది. ఇప్పటికే సినిమా టీజర్ ని రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన టీమ్, సినిమాపై మరింత బజ్ పెరిగేలా ప్రిపరేషన్స్ బిగిన్ చేసింది. అఖిల్ ఈ సినిమాలో మోస్ట్ రొమాంటిక్ యంగ్ స్టర్ లా కనిపించనున్నాడు. ‘హలో’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తరవాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వెంకీ అట్లూరి ఈ సినిమాకి డైరెక్టర్.