ఫస్ట్ లుక్ తో రెడీ అయిన మిస్టర్ మజ్ను

Monday,September 17,2018 - 11:18 by Z_CLU

అఖిల్ మూడో సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ను రీసెంట్ గా ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. ఇప్పుడిదే టైటిల్ తో అఖిల్ మూడో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

19వ తేదీ సాయంత్రం 4 గంటలకు మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎనౌన్స్ చేశాడు.

తొలిప్రేమతో హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. అతడు చెప్పిన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అఖిల్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా లండన్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ కీలకమైన షెడ్యూల్ నడుస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.