అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్ కంప్లీట్

Thursday,January 10,2019 - 02:57 by Z_CLU

ఈ రోజుతో సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది ‘మిస్టర్ మజ్ను’ సినిమా. గత 3 రోజులుగా ఈ సినిమాలోని సంగీత్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఈ రోజు సినిమా లాస్ట్ డే షూట్ అంటూ అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘మిస్టర్ మజ్ను’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా సిక్స్ ప్యాక్స్ లో కనిపించనున్న అఖిల్ లుక్స్, ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ తో పాటు, టీజర్ ఇలా వరసగా సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఈ వరసలో ఈ సినిమా నుండి రానున్న నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుందా..? అనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది మిస్టర్ మజ్ను. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. నిధి అగర్వాల్ హీరోయిన్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 25 ఈ సినిమా రిలీజ్ డేట్.