డిఫెరెంట్ లొకేషన్ లలో అఖిల్ సినిమా

Monday,May 08,2017 - 11:02 by Z_CLU

ఏప్రిల్ 4 న సెట్స్ పైకి వచ్చింది అఖిల్ సినిమా. అప్పటినుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, తరవాతి షెడ్యూల్స్ ని రేర్ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ లొకేషన్స్ లిస్ట్ లో అలహాబాద్, ఆగ్ర, లక్నో లాంటి ప్రదేశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో లుక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్న అఖిల్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు విక్రమ్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.