అఖిల్ ఇంటర్వ్యూ

Saturday,January 26,2019 - 11:02 by Z_CLU

గ్రాండ్ గా రిలీజయింది ‘మిస్టర్ మజ్ను’. ప్యాషనేట్ లవర్ గా అఖిల్ పర్ఫామెన్స్ కి ఓవరాల్ గా అప్లాజ్ దక్కుతుంది. ఈ సందర్భంగా ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు అఖిల్. అవి మీకోసం… 

యంగర్ వర్షన్…

మజ్ను అంటేనే ప్యాషనేట్ లవర్. ‘మిస్టర్ మజ్ను’ అనేది యంగర్ వర్షన్ ఆఫ్ మజ్ను. ఈ టైటిల్ ని సజెస్ట్ చేసింది వెంకీనే. అక్కినేని ఫ్యామిలీకి హార్ట్ కోర్ ఫ్యాన్ వెంకీ.

నాన్న ఫ్యాన్ ని చూశా…

నాతో చాలా క్యాజువల్ గా ఉంటాడు వెంకీ. కానీ నాన్న దగ్గరికి వచ్చేసి చాలా మారిపోతాడు. నర్వస్ అయిపోతుంటాడు. ఆయన సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయ్యే ఈ సినిమా రాసుకున్నాడు వెంకీ.

అదీ వెంకీ…

వెంకీ తన సినిమాల్లో సీన్స్ కన్నా ఎక్కువగా క్యారెక్టర్స్ పై ఎక్కువ ఫోకస్ పెడతాడు. మ్యాగ్జిమం కథలో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్ లో మేం కూడా క్యారెక్టర్స్ తో అంతే సింక్ అవుతాం.

వెంకీ గుడ్ బాయ్ కాదు…

వెంకీ చాలా నాటీ.. చాలా సింపుల్ గా గుడ్ బాయ్ లా కనిపిస్తాడు కానీ చాలా అల్లరి చేస్తాడు.

అక్కినేని లవ్ స్టోరీ…

టైటిల్ ని పక్కా ప్లానింగ్ గా పెట్టుకోలేదు. ఒక ‘అక్కినేని లవ్ స్టోరీ’ రాసుకున్నాడు. తను టైటిల్ చెప్పినప్పుడు కూడా నాకు ఆ టైటిలే కరెక్ట్ అనిపించింది. పాప్యులర్ టైటిలే ఉండాలని తను అనుకోలేదు.

కానీ అలా చేయలేదు…

వెంకీ నాకీ స్టోరీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ సినిమాని చేసే చాన్సెస్ లేవు. అప్పటికే వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. అందుకే వెంకీతో ఇది థర్డ్ మూవీగా అయితేనే చేయగలుగుతాను. ఈ లోపు నువ్వెవరితో నైనా చేయాలనుకుంటే చేసెయ్ అని చెప్పాను. కానీ వెంకీ నాకోసం ఆగాడు.

అదే చేంజ్…

సినిమాలో నా లుక్ విషయంలో టెస్ట్ చేశాం కానీ, సీన్స్ విషయానికి వస్తే వెంకీ చాలా న్యాచురల్ గా చూపించడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. దాంతో పాటు సినిమాటిక్ ఫీల్ పోకుండా మ్యానేజ్ చేశాడు. అందుకే ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తున్నా.

వెంకీ – సేమ్ బ్యానర్…

ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి వెంకీకి మంచి రిలేషన్ షిప్ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు టీజ్ చేసుకుంటూనే ఉంటారు. ఆ రిలేషన్ షిప్ ఉంది కాబట్టే, వెంకీ 2 సినిమాలు ఒకే బ్యానర్ లో పడ్డాయి.

నాకు OCD ఉంది…

సుమంత్ కి నాకన్నా 10 రెట్లు OCD ఉంది. మా చుట్టు పక్కలా కొంచెం డర్టీగా ఉన్నా, అస్సలు భరించలేం. ఇమ్మీడియట్ గా క్లీన్ చేసుకుంటాం.

NTR ఎప్పుడూ చెప్పలేదు…

రీసెంట్ గా ఈవెంట్ లో NTR నా గురించి చెప్పిన మాటలు ఎప్పుడూ నాతో పర్సనల్ గా చెప్పుకోలేదు. ఆయనకు లోపల్లోపల నాపై అలాంటి అభిప్రాయం ఉందని నాకు తెలుసు, కానీ ఆయన నోటి నుండి వినడం చాలా హ్యాప్పీగా అనిపించింది.

‘మిస్టర్ మజ్ను జర్నీ’…

ఈ సినిమా చేసే ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాం. కంప్లీట్ యంగ్ టీమ్ అవ్వడం వల్ల ఒకరికొకరం చాలా క్లోజ్ అయ్యాం. నవ్వుకున్నాం, అల్లరి చేశాం, సినిమాని మరింతగా ప్రేమించాం. అద్భుతమైన జర్నీ.

నిధి గురించి…

ఈ సినిమాకి ముందు నిధితో పెద్దగా పరిచయం లేదు. సెట్స్ పైనే ఇద్దరం క్లోజ్ అయ్యాం. అందునా ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో చేశాం కాబట్టి, మాకు మేమే ఉన్నాం. అలా ఇద్దరం కలిసి లంచ్ చేయడం, వర్కవుట్ చేయడం, ఈ ప్రాసెస్ లో నాకు నిధి గురించి ఇంకొంచెం తెలుసుకునే అవకాశం దొరికింది.

సిసింద్రీ చూసినప్పుడు…

సిసింద్రీ సినిమా చూసినప్పుడల్లా ఒకటే ఫీలింగ్ ఉంటుంది. అందులో ఒక్క మూమెంట్ కూడా నాకు గుర్తు లేదు. అందరికీ ఆ సినిమా గురించి ఎక్స్ పీరియన్సెస్ ఉన్నాయి కానీ నాకు లేవు. చిన్నప్పుడు చాలా రోజుల వరకు అదే నా ఫేవరేట్ సినిమా. కానీ నాకు అది నేనే అనే విషయం తెలిసేది కాదు.

నాకు, చైతుకి అదే తేడా…

చైతు నాన్నను చాలా ఫాలో అవుతాడు డిసిప్లిన్ విషయంలో నేను కూడా అవుతాను కానీ, వాళ్ళను రీచ్ అవ్వలేను. మహా అయితే సినిమా చేస్తున్నంత సేపే డిసిప్లిన్ గా ఉంటా. వాళ్ళు మాత్రం ఎప్పుడు డిసిప్లిన్ గానే ఉంటారు.