సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమా హీరో ఇతడే

Friday,July 10,2020 - 04:21 by Z_CLU

 

సినిమా సినిమాకు చిన్న గ్యాప్ తీసుకుంటూ ముందుకెళ్తున్న అఖిల్ అక్కినేని ఇకపై స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నాలుగో సినిమా చేస్తున్న అఖిల్ నెక్స్ట్ సినిమాను ఓ స్టార్ డైరెక్టర్ తో చేస్తున్నాడట. అవును… మెగాస్టార్ తో ‘సైరా’ తీసిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని సమాచారం.

నెక్స్ట్ ఓ లవ్ స్టోరీతో సినిమా చేయాలని అందుకు కథ సిద్దం చేసుకున్న సురేందర్ రెడ్డి ఆ స్క్రిప్ట్ అఖిల్ కి నెరేట్ చేశాడని, కథ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

ప్రస్తుతానికి ఈ కాంబో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి ఓ యంగ్ హీరోతో సినిమా చేయనుండటం విశేషం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.