గీతా ఆర్ట్స్ లో అఖిల్.. నిజమెంత?

Monday,February 18,2019 - 11:58 by Z_CLU

అక్కినేని యంగ్ తరంగ్ అఖిల్ నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కాకపోతే ఈసారి అఖిల్ నుంచి కాస్త సర్ ప్రైజింగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అఖిల్ హీరోగా కొత్త సినిమా వస్తుంది

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అఖిల్ హీరోగా నటించనున్న సినిమాను పరశురాం డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి గీతాఆర్ట్స్ బ్యానర్ పైనే సినిమా చేసేందుకు రెడీ అయిన పరశురాం, అఖిల్ కు ఓ మంచి స్టోరీలైన్ వినిపించాడని టాాక్.

అంతా బాగానే ఉంది కానీ, పరశురాం ఎంట్రీ కంటే ముందు ఇద్దరు దర్శకుల పేర్లు అఖిల్ లిస్ట్ లో ప్రముఖంగా వినిపించాయి. మరీ ముఖ్యంగా సత్య పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ వచ్చాయి. మరి ఆ మూవీ మేటర్ ఎంతవరకు వచ్చిందో!