నాగార్జున 'బంగార్రాజు' లో అఖిల్ కూడా..?

Saturday,January 19,2019 - 12:03 by Z_CLU

ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ని లాక్ చేసేశాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నాగార్జున కరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో అఖిల్ కూడా నటించనున్నాడా…? ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అఖిల్ రోల్ ని మరింత ఎట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేయనున్నాడనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

‘సోగ్గాడే చిన్ని నాయనా’ కథకి ఈ ‘బంగార్రాజు’ కొనసాగింపుగా ఉండదు కానీ, ఆ సినిమాలోని బంగార్రాజు క్యారెక్టరే ఈ సినిమాలో నాగార్జున గారు ప్లే చేస్తారు అని రీసెంట్ గా  కన్ఫమ్  చేసిన కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ గురించి అసలు ప్రస్తావించలేదు. దాంతో అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు ఈ సినిమాలో అఖిల్ నటించబోతున్నాడా..? లేకపోతే ఇది జస్ట్ రూమరా..? అనే డిస్కర్షన్స్ లో ఉన్నారు ప్రస్తుతం ఫ్యాన్స్.

ఈ సినిమా చుట్టూ ఈ రేంజ్ లో  ఎగ్జైట్మెంట్ ని పెంచేస్తున్న అఖిల్ రోల్ ని కాస్త పక్కన పెడితే, నాగ్ మాత్రం మరోసారి బంగార్రాజులా మరోసారి పంచె కట్టులో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో ఈ సారి నాగ్  సరసన జోడీ కట్టనున్న హీరోయిన్ దగ్గరి నుండి తక్కిన టెక్నీషియన్స్ డీటేల్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.