క్రిష్ దర్శకత్వంలో అఖిల్?

Saturday,February 02,2019 - 12:53 by Z_CLU

అఖిల్ నెక్ట్స్ మూవీపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఒక నెల రోజులు ఆగితే తనే స్వయంగా ప్రకటిస్తానని అఖిల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ గాసిప్స్ మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే ఈ గాసిప్స్ లిస్ట్ లోకి బోయపాటి, శ్రీనువైట్ల చేరిపోయారు. తాజాగా క్రిష్ ను కూడా చేర్చేశారు.

అవును… అఖిల్ తన నెక్ట్స్ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడు ప్రాజెక్టులో క్రిష్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే క్రిష్-అఖిల్ మూవీపై క్లారిటీ వస్తుందట.

కెరీర్ లో ఇప్పటివరకు 3 సినిమాలు చేశాడు అఖిల్. ఇతడి రీసెంట్ మూవీ మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.