శర్వానంద్ సరసన అఖిల్ బ్యూటీ

Tuesday,March 06,2018 - 03:42 by Z_CLU

అఖిల్ నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది కల్యాణి ప్రియదర్శన్. ఆ సినిమా తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ లో తన రెండో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న శర్వానంద్ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించనుంది కల్యాణి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో ఇది సెట్స్ పైకి రానుంది.  మాఫియా బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించనున్నాడు శర్వానంద్. ప్రస్తుతం ఈ హీరో పడి పడి లేచె మనసు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోల్ కతాలో జరుగుతోంది. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సుధీర్ వర్మ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

 

ప్రస్తుతం ఓ తమిళ్, మరో మలయాళ సినిమాలో నటిస్తోంది కల్యాణి. వీటిలో మలయాళ సినిమా దాదాపు పూర్తయింది. తమిళ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా వర్క్ కంప్లీట్ అయిన వెంటనే శర్వానంద్ మూవీ సెట్స్ పైకి వస్తుంది ఈ బ్యూటీ. ఈ ప్రాజెక్టుకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.