అఖిల్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

Tuesday,November 22,2016 - 01:38 by Z_CLU

ఫస్ట్ సినిమా రిలీజ్ కన్నా ముందే భారీ క్రేజ్ క్రియేట్ అయిన స్టార్ అఖిల్. తన డెబ్యూ సినిమా తరవాత అంత ఈజీగా ఏ డైరెక్టర్ కి ఓకె చెప్పని అఖిల్, చివరికి అవుట్ స్టాండింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన విక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది.

megha-akash

డైరెక్టర్ విషయంలో చాలా కష్టపడ్డాడు కానీ, హీరోయిన్ విషయంలో మాత్రం పెద్దగా టైం తీసుకోలేదు అఖిల్. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హీరోయిన్  మేఘ ఆకాష్ ని తన సినిమాలోను హీరోయిన్ గా ఫిక్స్ చేసేశాడు అఖిల్. గౌతమ్ మీనన్ హీరోయిన్ అంటే చాలు, పేరేంటని కూడా అడగరు ఫ్యాన్స్. గౌతమ్ మీనన్ హీరోయిన్స్ అంటేనే ఓ స్పెషల్ బ్రాండ్. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా డెసిషన్ తీసుకున్నాడు అఖిల్ .