పవర్ స్టార్ సినిమాలో అఖిల్ హీరోయిన్ ?

Wednesday,December 14,2016 - 01:00 by Z_CLU

కాటమరాయుని స్పీడ్ చూస్తుంటే, రేపో మాపో సినిమాకి ప్యాకప్ చెప్పేసి త్రివిక్రమ్ సినిమాలో ప్రత్యక్షమయ్యేలా ఉన్నాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం సినిమా షూటింగ్ లోనే స్పెండ్ చేస్తున్నాడు. ఆయన స్పీడ్ ని మైండ్ లో పెట్టుకుని ఇప్పటికే క్యూలో ఉన్న డైరెక్టర్స్, తమ సినిమాకి కావాల్సిన సరంజామాని సర్దుకుంటున్నారు.

మ్యాగ్జిమం జనవరి ఎండ్ కల్లా త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ పైకి ఉండేలా స్కెచ్ వేసుకున్న పవర్ స్టార్, మరోవైపు  R.T. నేసన్ తో కూడా డిస్కషన్స్ జరుపుతున్నాడు. మొన్నటి వరకు ఈ కాంబోలో నయనతార హీరోయిన్ గా కన్ఫం అయింది అన్న టాక్ కూడా వినిపించింది.

సరేలే ఫ్రెష్ కాంబో అని కాస్తంత మైండ్ సెట్ చేసుకునే లోపు, ఇప్పుడు అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్ పేరు బయటికి వచ్చింది. కాస్తంత కన్ఫ్యూజన్ గానే ఉన్నా, ఫ్యాన్స్ కి మాత్రం ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇంతకీ ఈ సినిమాలో నయన్, సాయేషా ఇద్దరు హీరోయిన్సా..? లేకపోతే నయన్ ప్లేస్ లో సాయేషా రీప్లేస్ అయిందా అనేది తేలాల్సిన విషయమే.