ఓవర్ సీస్ లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘హలో’

Wednesday,December 13,2017 - 07:40 by Z_CLU

అఖిల్ హలో డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజవుతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్ సీస్ లోను అదే రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. UK లో సిల్వర్ స్టోన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిలీజవుతున్న ఈ మూవీ డిసెంబర్ 21 న గ్రాండ్ ప్రీమియర్స్ కి రెడీ అవుతుంది.

క్రిస్మస్ సీజన్ కావడం, అందునా ఓవర్ సీస్ లో హాలీడేస్ ఉండటంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తుంది ‘హలో’ టీమ్. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, ఆ తరవాత రిలీజైన ట్రైలర్, సాంగ్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడమే కాదు, సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసింది. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.