అఖిల్ ‘హలో’ టీజర్ అదిరింది

Thursday,November 16,2017 - 07:33 by Z_CLU

అఖిల్ హలో ‘టీజర్’ రిలీజైంది. ‘ద లక్కియెస్ట్  పీపుల్ బార్న్ ఆన్ దిస్ అర్త్’ అంటూ నాగార్జున వాయిస్ తో బిగిన్ అయ్యే టీజర్, అటు సినిమాలోని ఇమోషనల్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తూనే, మూవీలో హై-ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ ని  కూడా  చూపించింది.

టీజర్ చూస్తే చిన్నప్పుడే హీరోహీరోయిన్లు విడిపోయారనే విషయం అర్థమౌతుంది. అలా విడిపోయిన హీరోయిన్ ను హీరో ఎలా కనుగొన్నాడు.. ఆమెను ఎలా చేరుకున్నాడనేది హలో సినిమా స్టోరీ. టీజర్ లో కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు అఖిల్. మరీ ముఖ్యంగా అఖిల్ పెర్ఫామ్ చేసిన స్టంట్స్ టోటల్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. సినిమాలో కూడా మెయిన్ హైలెట్స్ అవే అంటోంది యూనిట్. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు.

ఇక హలోతో టాలీవుడ్ కు పరిచయమౌతున్న కల్యాణి లుక్ ను కూడా ఎలాంటి సస్పెన్స్ లేకుండా టీజర్ లోనే రివీవ్ చేశారు. ఓవరాల్ గా హలో సినిమా ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది. మనంతో అక్కినేని హీరోలందరికీ హోల్ సేల్ గా నచ్చేసిన విక్రమ్ కుమార్, అనూప్ రూబెన్స్ జోడి మరోసారి హలో టీజర్ తో మెస్మరైజ్ చేసింది. డిసెంబర్ 22న హలో సినిమాను వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు.