ఓవర్ సీస్ లో బాక్సాఫీస్ దుమ్ము రేపుతున్న ‘హలో’

Saturday,December 23,2017 - 02:44 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజయింది ‘హలో’ సినిమా. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు స్టేట్స్ లోనే కాదు ఓవర్ సీస్ లోను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఓవర్ సీస్ లో గురువారం 140 లొకేషన్ లలో, శుక్రవారం 157 లొకేషన్ లలో రిలీజైన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర అత్యదిక వసూళ్ళను రికార్డ్ చేసుకుంటుంది.

గురువారం నాడు ఏకంగా $ 210,840 వసూలు చేసిన ‘హలో’, ఫ్రైడే రోజు $1,18000 వసూళ్లతో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మూడో రోజు కూడా అదే రేంజ్ క్రేజ్ నిలబెట్టుకున్న ‘హలో’ ఈ వీకెండ్ కి హాఫ్ మిలియన్ రీచ్ అవ్వడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

రిలీజ్ కి ముందే ఎట్రాక్ట్ చేసిన అఖిల్ లుక్స్, యాక్షన్ ఎలిమెంట్స్,  విక్రమ్ కుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే.. ఇలా ‘హలో’ సినిమాలో ప్రతి ఎలిమెంట్ అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది.