గ్రాండ్ గా జరగనున్న అఖిల్ ‘హలో’ ఆడియో లాంచ్

Tuesday,December 05,2017 - 01:31 by Z_CLU

టీజర్, ట్రయిలర్ తో ఇప్పటికే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది హలో మూవీ. అక్కినేని చిచ్చరపిడుగు అఖిల్ నటిస్తున్న ఈ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీకి విక్రమ్ కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ట్రయిలర్ లో హంగామా చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఆడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 10న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. వైజాగ్ లో ఈ ఆడియో ఫంక్షన్ ఉండే ఛాన్స్ ఉంది.

హలో సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. గతంలో విక్రమ్ కుమార్, అనూప్ కాంబోలో వచ్చిన ఇష్క్, మనం పాటలు సూపర్ హిట్ అవ్వడంతో.. హలో సాంగ్స్ పై క్రేజ్ డబుల్ అయింది. అఖిల్ ఈ సినిమాలో స్వయంగా ఓ పాట కూడా పాడడంతో.. మూవీ ఆడియోపై క్రేజ్ పీక్స్ కు చేరుకుంది.

అఖిల్ సరసన కళ్యాణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. డిసెంబర్ 22న హలో సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.