అఖిల్ 'హలో' ఆడియో రివ్యూ

Monday,December 11,2017 - 01:26 by Z_CLU

నిన్న వైజాగ్ లో జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్ తో టాలీవుడ్ లో ‘హలో’ సీజన్ బిగిన్ అయింది. యూత్ లో అన్ లిమిటెడ్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ యూత్ ఫుల్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్, నిన్న రిలీజైన సాంగ్స్ తో మరింత హీట్ ని జెనెరేట్  చేస్తుంది. 6 పాటలున్న ఈ మూవీ అనూప్ రూబెన్స్ కి ఇది 50 వ సినిమా కావడం విశేషం.

 

హలో : చిన్నప్పుడే విడిపోయిన సోల్ మేట్స్ ఎలా కలుసుకున్నారు అనేదే ‘హలో’ సినిమా మెయిన్ థీమ్. ఆ థీమ్ ని హైలెట్ చేసే సాంగ్ ఇది… హాంటింగ్ మెలోడీలా కంపోజ్ అయిన ఈ సాంగ్ ని ఎవరైనా, ఈజీగా హమ్ చేసేయొచ్చు… కంప్లీట్ ఫీల్ ని ఎలివేట్ చేస్తూ వనమాలి, శ్రేష్ఠ కలిసి రాసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి రిలీజైన నెక్స్ట్ మూమెంట్ నుండే మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది. ఈ పాటని అర్మాన్ మాలిక్, సౌజిత్ కలిసి పాడారు.

అనగనగా ఒక ఊరు : సినిమాలో లీడ్ రోల్స్ చైల్డ్ హుడ్ లో బిగిన్ అయ్యే స్టోరీ కాబట్టి సందర్భానుసారంగా ఉండే పాట ఇది. చిన్నతనం లోనే కలుసుకున్న ఇద్దరి ఫీలింగ్ ని ఎలివేట్ చేస్తూ ఉండే ఈ పాటలో, అనూప్ రూబెన్స్ మార్క్ కనిపిస్తుంది. చంద్రబోస్ లిరిక్స్ రాసిన ఈ పాటని శ్రీధృతి పాడింది.

తలచి తలచి : చిన్నప్పుడే విడిపోయిన సోల్ మేట్ ని వెదుకుతూ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే సాంగ్. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కంపోజ్ అయిన ట్యూన్స్ వనమాలి లిరిక్స్, సినిమాలో హీరో పడే తపనను ఎలివేట్ చేస్తుంది.

 

ఏవేవో కలలు కన్నా : అఖిల్ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ ఎంత మెస్మరైజింగ్ గా ఉంటుందో, తను పాడిన ఈ సాంగ్ కూడా అంతే స్ట్రేట్ గా రీచ్ అవుతుంది. అఖిల్ తో పాటు జోనితా గాంధీ పాడిన ఈ సాంగ్, ఈ మొత్తం ఆల్బంలో స్పెషల్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఈ పాటని చంద్రబోస్ రాశాడు.

అనగనగా ఒక ఊరు: శ్రియ ఘోషల్ పాడిన ఈ సాంగ్ లీడ్ రోల్స్ చైల్డ్ హుడ్ లో ఉండే సాంగ్ కి ఫీమేల్ వర్షన్.   చంద్రబోస్ రాసిన ఈ లిరిక్స్ ఫ్రెష్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మెరిసే మెరిసే : ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చెప్పనక్కరలేదు. హలో టీమ్ కూడా ఈ సాంగ్ ని స్పెషల్ గా ప్రమోట్ చేస్తుంది. లావిష్ గా తెరకెక్కిన ఈ వెడ్డింగ్ సాంగ్ ని హరిచరణ్, శ్రీనిధి వెంకటేష్ తో పాటు శృతి రంజని కలిసి పాడారు. వనమాలి , శ్రేష్ఠ ఈ సాంగ్ ని రాశారు.