ఎట్రాక్ట్ చేస్తున్న ‘హలో’ యాక్షన్ మేకింగ్ వీడియో

Tuesday,December 12,2017 - 03:40 by Z_CLU

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఖిల్ ‘హలో’ డిసెంబర్ 22 న రిలీజ్ కి రెడీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకి పెరుగుతున్న క్రేజ్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని మరింతలా ఎలివేట్ చేసింది హలో టీమ్.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రౌన్ కంపోజ్ చేసిన స్టంట్ సీక్వెన్సెస్ సినిమాపై హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా నాగార్జున కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ జాకీచాన్ గుర్తుకు వస్తాడు అని చెప్పడం కూడా సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్  గా ఇంట్రడ్యూస్ అవుతుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.