Akhil Akkineni graced Dance India Dance Telugu Grand finale
సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్ట్ గా విచ్చేసిన బిగ్గెస్ట్ డాన్స్ షో ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ తక్కువ టైమ్ లో తెలుగు టెలివిజన్ లో సూపర్ హిట్ డాన్స్ షో అనిపించుకుంది. డాన్స్ ను ఇష్టపడే వారినే కాకుండా అందరినీ అలరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా జరిగింది. ఫినాలే కి అక్కినేని అఖిల్ అక్కినేని గెస్ట్ గా హాజరై షోకి కొత్త ఎనర్జీ తీసుకొచ్చాడు.
అఖిల్ గ్రాండ్ ఎంట్రీ విజువల్స్ తో పాటు షోలో అఖిల్ చేసిన హంగామాతో తాజాగా విడుదలైన డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు గ్రాండ్ ఫినాలే ప్రోమో ఆకట్టుకుంటుంది. జీ తెలుగులో జనవరి 22న ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవ్వబోతున్న ఈ ఫైనల్ ఎపిసోడ్ డాన్స్ ప్రియులతో పాటు అందరినీ అలరించనుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. డాన్స్ తో పాటు షోలో రోహిణీ కామెడీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ అందించడం పక్కా. ఇక షోలో అఖిల్ ను చూడగానే ఎందుకు ఇంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అంటూ హీరోయిన్ ఆనంది చెప్పిన మాట ప్రోమో లో హైలైట్. అలాగే రోహిణీ అయ్యగారే నంబర్ 1 అనడం , దానికి అఖిల్ స్మైల్ ప్రోమోలో స్పెషల్ ఎట్రాక్షన్.
తెలుగులో మోస్ట్ పాపులర్ డాన్స్ షో గా గుర్తింపు అందుకున్న ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ గ్రాండ్ ఫినాలే లో విజేత గా నిలిచిందెవరు ? అఖిల్ చేతుల మీదుగా ట్రోఫీ దక్కించుకుందెవరు ? తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు షో చూడడం మిస్ అవ్వకండి. Dont Miss it !