#Agent - షూటింగ్ మొదలెట్టేశాడు!
Monday,July 12,2021 - 01:43 by Z_CLU
అక్కినేని అఖిల్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటివలే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సురేందర్ రెడ్డి ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ తో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్ నంబర్ 10 ఓ కాఫీ షాప్ లో అఖిల్ పై కొన్ని సీన్స్ తీస్తున్నారు. మొదటి షెడ్యుల్ అంతా సినిమాలో అఖిల్ లుక్ ఎలా ఉండనుందో తెలియజేస్తూ నిన్న వదిలిన అఖిల్ జిమ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారీ కండలతో, సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్తగా కనిపించనున్నాడు అఖిల్. హీరోలను డిఫరెంట్ లుక్స్ లో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ని మెప్పించే సురేందర్ రెడ్డి సినిమాలో అఖిల్ ని ఎలా చూపిస్తాడా ? అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో సినిమా ఇది. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
అఖిల్ సరసన సాక్షి వైద్య అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ముంబై లో మోడలింగ్ చేసే సాక్షి ఏజెంట్ తో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైవుతుంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు హేరియిన్ ధరుమన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి సినిమాకు ఎడిటర్. నేటి నుండి షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని సమచారం.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics