Balakrishna - ''అఖండ'' విజయం

Thursday,April 22,2021 - 02:19 by Z_CLU

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ. విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద హిట్టయింది. దీనికి కారణం ఈ సినిమా టీజర్.

సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`‌. ద్వారక‌ క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది కానుక‌గా `అఖండ` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.

ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ 33 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజ‌ర్ సృష్టించిన సెన్సేష‌న్‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో `అఖండ` మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌గా పెరిగాయి. ఏప్రిల్ 30 వ‌ర‌కూ నాన్‌స్టాప్‌గా జ‌రిగే షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్త‌వుతుంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి త‌మన్‌ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics