AkhandaSuccess టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం

Saturday,December 11,2021 - 10:09 by Z_CLU

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన భారీ కమర్షియల్ మాస్ సినిమా ‘అఖండ‘ తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం ఇచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటికే చాలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చిన్న సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. లవ్ స్టోరీ లాంటి సినిమా కూడా వారంలోపే బాగా ఆడాయి. తప్ప రెండో వారంలో భారీ వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఈ టైంలో పెద్ద సినిమా థియేటర్స్ లోకి వస్తే పరిస్థితి ఏంటి ? అనే సందేహాలను పటా పంచెలు చేసేసింది ‘అఖండ’. భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా వారం తిరిగే లోపే యాబై కోట్ల షేర్ దాటేసింది.

మొదటి రోజు యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా వసూళ్ళతో మేజిక్ చేసింది. ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ తోనే భారీ కలెక్షన్స్ తెచ్చుకుంది. నైజాంలో భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి యాబై కోట్ల మార్క్ దగ్గరకి చేరిన ఈ సినిమా ఈ వీకెండ్ లో అరవై కోట్ల మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

‘లక్ష్య’ మూవీ రివ్యూ

ఇప్పుడు ‘అఖండ’ ఇచ్చిన వసూళ్ళ ఉత్సాహంతో బడా సినిమాలు ధైర్యంగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మంచి కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు పరిస్థితులు పట్టించుకోకుండా సినిమాకి ఎలా బ్రహ్మ రథం పడతారో మరోసారి రుజువు చేసింది ‘అఖండ’. నెక్స్ట్ వీక్ బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో  ‘పుష్ప‘ సినిమా రాబోతుంది. సంక్రాంతి బరిలో ‘RRR‘ , ‘భీమ్లా నాయక్‘ ,’రాధే శ్యామ్‘ రెడీగా ఉన్నాయి. మరి ‘అఖండ’ రీతిలోనే వచ్చే బడా సినిమాలన్నీ భారీ వసూళ్ళు రాబడితే  సెకండ్ వేవ్ తర్వాత తక్కువ టైంలో పికప్ అయిన ఇండస్ట్రీ గా టాలీవుడ్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవడం ఖాయం.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics