Akhanda - అఖండ 3 రోజుల వసూళ్లు

Sunday,December 05,2021 - 03:28 by Z_CLU

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాలయ్య క్రియేట్ చేసిన మాస్ జాతర ముందు నెగెటివిటీ కొట్టుకుపోయింది. మొదటి రోజు వచ్చిన వసూళ్లకు ఏమాత్రం తగ్గని విధంగా మూడో రోజు కూడా కలెక్షన్ వచ్చిందంటే అఖండ ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు.

నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్ల 46 లక్షల రూపాయల షేర్ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సినిమా మరో వారం రోజులు నిలబడాల్సి ఉంటుంది.

వరల్డ్ వైడ్ 53 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది అఖండ మూవీ. ప్రస్తుతానికి 34 కోట్ల 71 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. అంటే 3 రోజుల్లోనే సగానికి పైగా బ్రేక్ ఈవెన్ అయిందన్నమాట. ఈరోజు వీకెండ్ కాబట్టి వసూళ్లు గట్టిగా వస్తాయని భావిస్తున్నారు. అదే ట్రెండ్ కొనసాగితే 80శాతం బ్రేక్ ఈవెన్ అవుతుంది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే 8 లక్షల డాలర్లు ఆర్జించిన ఈ మూవీ త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది.

అఖండ 3 రోజుల షేర్లు
నైజాం – రూ. 9.13 కోట్లు
సీడెడ్ – రూ. 7 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.9 కోట్లు
ఈస్ట్ – రూ. 2.03 కోట్లు
వెస్ట్ – రూ. 1.62 కోట్లు
గుంటూరు – రూ. 2.70 కోట్లు
నెల్లూరు – రూ. 1.40 కోట్లు
కృష్ణా – రూ. 1.68 కోట్లు