LIGER ఫస్ట్ సింగల్ 'అక్డీ పక్డీ' సాంగ్ రిలీజ్

Monday,July 11,2022 - 07:44 by Z_CLU

Akdi Pakdi Song From Vijay Deverakonda, Puri Jagannadh’s LIGER (Saala Crossbreed) Out

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సంచలనం సృష్టించింది. యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్ గా ట్రెండింగ్‌ లో నిలిచింది. తాజాగా ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజైంది.

అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌ ని అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ. సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది.

లిజో జార్జ్-డిజె చేతాస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. విజయ్‌ కి జోడీగా అనన్య పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట తమిళ వెర్షన్‌ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌ గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics