

Wednesday,October 20,2021 - 10:32 by Z_CLU
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ షాట్‌లో అద్బుతంగా అనిపించాడు. ఆకాష్ మొదటి సినిమాకు ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది. రమ్యకృష్ణగారు ఎప్పటిలానే అద్భుతంగా నటించారు. అందరూ అక్టోబర్ 29న ఈ సినిమాను చూడండి. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
2నిమిషాల10 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్‌ను గమనిస్తే… రొమాంటిక్ టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది. ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించినట్టు కనిపిస్తోంది.
వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్‌లో కేతిక శర్మ రొమాంటిక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉన్నారు. రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీలో ఆకాష్ పూరి అద్భుతంగా నటించారు. కేతిక శర్మ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసేలా ఉంది. ఈ ఇద్దరి జోడి తెరపై ఫ్రెష్‌గా కనిపించింది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ రొమాంటిక్ చిత్రానికి ప్లస్ అవనున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం, నరేష్ సినిటోగ్రఫీ బాగా కుదిరాయి. మొత్తంగా రొమాంటిక్ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. సినిమా మీద అంచనాలను పెంచేలా ఉంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 29న ఈ చిత్రం విడుదలకానుంది.
తారాగణం:
ఆకాశ్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ట, మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునైన
సాంకేతిక వర్గం:
కథ,స్క్రీన్‌ప్లే,డైలాగ్స్: పూరిజగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాదూరి
నిర్మాతలు: పూరిజగన్నాధ్, ఛార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బేనర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్
సంగీతం: సునిల్ కశ్యప్
సినిమాటోగ్రఫి: నరేష్
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
ఆర్ట్: జానీ షేక్
లిరిక్స్: భాస్కరభట్ల
ఫైట్స్: `రియల్` సతీష్
పిఆర్ఓ: వంశీ – శేఖర్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU