ఆకాష్ పూరి 'చోర్ బజార్' లాంచ్

Thursday,February 18,2021 - 03:52 by Z_CLU

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘చోర్ బజార్’ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్షన్ లో ఆకాష్ నటిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఫిబ్రవరి 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్ కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నాడట జీవన్ రెడ్డి. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించనున్నాడు. సుబ్బరాజు, పోసాని, “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

అనిల్ పాడురి డైరెక్షన్ లో ‘రొమాంటిక్’ సినిమాను కంప్లీట్ చేసిన ఆకాష్ కి హీరోగా ఇది మూడో సినిమా.