డెబ్యూ డైరెక్టర్ తో ఆకాశ్ ...త్వరలోనే అనౌన్స్ మెంట్

Sunday,September 02,2018 - 02:20 by Z_CLU

ఇటివలే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘మెహబూబా’ సినిమా చేసాడు ఆకాష్.. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాన్న డైరెక్షన్ లోనే మరో సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేసాడు. ఇక పూరి కూడా నెక్స్ట్ సినిమా కూడా ఆకాశ్ తోనే ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విషయంలో డెబ్యూ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.

నిన్నటి వరకూ పూరి నెక్స్ట్ సినిమా ఆకాశ్ తోనే అనే వార్త చక్కర్లు కొట్టగా ఇప్పుడు ఆకాష్ నెక్స్ట్ సినిమాను పూరి అసిస్టెంట్ డీల్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. పూరి దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడని తెలుస్తుంది. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు కథ- మాటలు అందిస్తున్నాడట పూరి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ జరుగుతుందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు వాస్కోడిగామా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.